Bank Jobs 2025: ఎస్బీఐలో 3,500కి పైగా ఉద్యోగాలు – నిరుద్యోగులకు గుడ్‌న్యూస్…

Telugu Career Zone Icon స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 3,500 కొత్త పోస్టులు విడుదల | Bank Jobs 2025

Bank Jobs 2025: దేశంలోని అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) నుంచి మరోసారి భారీ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌కు సంబంధించిన అప్‌డేట్ వచ్చింది. వచ్చే 5 నెలల్లో 3,500కి పైగా అధికారులను నియమించుకోవడానికి ఎస్బీఐ ప్లాన్ చేస్తోంది. బ్యాంక్ వ్యాపార విస్తరణ, కస్టమర్ సర్వీసులు మెరుగుపరచడం, మరియు సాంకేతిక రంగాల్లో నూతన అవకాశాలను అందించడమే ఈ రిక్రూట్‌మెంట్ ప్రధాన ఉద్దేశ్యం.

ఎస్బీఐ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ (HR) మరియు చీఫ్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ (CDO) కిశోర్ కుమార్ పోలుదాసు వెల్లడించిన ప్రకారం, ఇప్పటికే 541 ప్రొబేషనరీ ఆఫీసర్ (PO) పోస్టుల కోసం రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ ప్రారంభమైంది. ప్రిలిమినరీ, మెయిన్స్, సైకోమెట్రిక్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

ఇకపోతే, మరో 3,000 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ (CBO) పోస్టుల కోసం కూడా ప్రాసెస్ మొదలుపెట్టారని ఆయన తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ నియామక ప్రక్రియ పూర్తవుతుందని చెప్పారు.

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT), సైబర్ సెక్యూరిటీ (Cyber Security) రంగాల్లో కూడా ఎస్బీఐ బలాన్ని పెంచుతోంది. ఇప్పటికే 1,300కి పైగా స్పెషలిస్ట్ ఆఫీసర్లను సెలెక్ట్ చేసినట్లు బ్యాంకు వెల్లడించింది.

ఎస్బీఐలో ప్రస్తుతం మొత్తం వర్క్‌ఫోర్స్‌లో 27% మంది మహిళలు ఉన్నారు. వీరిలో ఫ్రంట్‌లైన్ సిబ్బందిలో 33% మహిళలు ఉన్నారు. 30% టార్గెట్‌ చేరుకునేందుకు ‘Empower Her’ పేరుతో లీడర్‌షిప్ ట్రైనింగ్, మదర్స్ కోసం నర్సరీ సదుపాయాలు, తిరిగి చేరే మహిళలకు ప్రత్యేక ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నారు.

ఎస్బీఐ మొత్తం ఈ ఆర్థిక సంవత్సరంలో 18,000 కొత్త పోస్టులు భర్తీ చేయనున్నట్లు ఛైర్మన్ సీఎస్ శెట్టి గతంలో ప్రకటించారు. వీటిలో 13,500 క్లరికల్ పోస్టులు, మిగతావి అధికారులు మరియు ఇతర విభాగాలకు సంబంధించినవిగా ఉంటాయి.

మొత్తం పోస్టులు – 18,000
ప్రస్తుత దశలో భర్తీ – 3,500+
విభాగాలు – PO, CBO, SO
మహిళల కోసం ప్రత్యేక స్కీములు – Empower Her Initiative

ఎస్బీఐలో ఉద్యోగం పొందాలనుకునే వారికి ఇది అద్భుత అవకాశం. దేశవ్యాప్తంగా బ్రాంచ్‌లలో భారీగా ఖాళీలు వస్తున్నందున బ్యాంక్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు SBI అధికారిక వెబ్‌సైట్ www.sbi.co.in/careers లో నిత్యం అప్‌డేట్స్ చెక్ చేయడం మంచిది.

Bank Jobs 2025 Post Office Jobs 2025: ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్‌లో 348 గ్రామీణ డాక్ సేవక్ ఉద్యోగాలు – Click Here

Bank Jobs 2025 Railway Jobs 2025: ఇంటర్ పాసైనవారికి 3,000 పైగా పోస్టులు – Click Here

WhatsApp